సోషల్‌ మీడియాలో మనం అప్పుడప్పుడు పాము విషం అత్యంత ఖరీదైనది అని.. ఒక్క డ్రాప్ రెండు డ్రాప్స్ కూడా లక్షల్లో రేటు ఉంటుందని తెల్సిందే. అలాంటి పాము విషంను విదేశాల్లో ఒక చోటు నుండి మరో చోటుకు యథేచ్ఛగా తరలిస్తూ ఉంటారు. అయితే ఇండియాలో మాత్రం పాము విషం రవాణ అనేది చట్టరీత్యా నేరం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాంతో ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా పాము విషం సరఫరా చేస్తున్న వారిని పోలీసులు పట్టుకుంటున్నారు. తాజాగా దేశ సరిహద్దు వద్ద పాము విషం పట్టుబడటంతో దేశ రక్షణకే ప్రమాదం అన్నట్లుగా పరిస్థితి మారింది. స్మగ్లర్లు రక్షణ సిబ్బంది కళ్లుగప్పి పాము విషం ను దేశంలోకి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ బోర్డర్‌ వద్ద ఉండే భద్రతా సిబ్బంది వారికి షాక్ ఇచ్చారు. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఇద్దరు స్మగ్లర్లు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తుండగా గస్తీ కాస్తున్న భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే వారిపైకి కాల్పులు జరపడంతో వెనక్కి పరుగు పెట్టారు. ఆ క్రమంలో వారి వద్ద ఉన్న పాము విషం బాటిల్ అక్కడ పడిపోయింది. దాన్ని స్వాదీనం చేసుకున్న భద్రతా సిబ్బంది అటవి శాఖ అధికారులకు అందించారు. 


పాము విషం ఉన్న సీసా పై మేడ్ ఇన్‌ ఫ్రాన్స్ అని రాసి ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం పోలీసులు మరియు బోర్డర్‌ భద్రత సిబ్బంది అధికారులు వెతుకుతున్నట్లుగా పేర్కొన్నారు. ఆ విషం మొత్తం కూడా కింగ్ కోబ్రా విషంగా అధికారులు గుర్తించారు. ఆ విషం బహిరంగ మార్కెట్ లో దాదాపుగా రూ.13 కోట్ల విలువ చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.


Also Read: Akhil Pooja Hegde Date : పూజా హెగ్డేతో డేటింగ్.. ఓపెన్ అయిన అఖిల్


పాము విషం తో అనేక  ఉపయోగాలు ఉంటాయి. పలు రసాయనాల తయారీకి మరియు ఇతర ఉత్పత్తులకు ఉపయోగించే ఈ పాము విషంకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే దేశాలు దాటి మరీ ఈ విషంను స్మగ్లింగ్‌ చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. విదేశాల్లో పాము విషం స్మగ్లింగ్‌ విషయంలో ఎక్కువ పట్టింపు లేని కారణంగా ఇండియాకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 


కానీ ఇండియాలో మాత్రం పాము విషం స్మగ్లింగ్‌ కు అవాంతరాలు ఎదురు అవుతున్నాయి. దాంతో చాలా చోట్ల పాము విషయం పట్టుబడుతూనే ఉంది. ముందు ముందు పాము విషం స్మగ్లింగ్‌ ఆపేందుకు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.


Also Read: BRS Party in Maharashtra: నేనే మహారాష్ట్రకు నేర్పుతున్నా.. సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి